ఓటమి భయంలో షన్ను.. సన్నీ ఫ్యాన్స్‌పై కామెంట్స్
on Dec 4, 2021
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరైన ప్రతీ ఒక ఇంటి సభ్యులకు ఏదో ఒక నిక్‌నేమ్‌ని పెట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో షణ్ముఖ్‌కి బ్రహ్మ అని పేరు పెట్టారు. ఏ ముహూర్తాన ఆ పేరుని తనకి పెట్టారో కానీ షన్ను మాత్రం బిగ్‌బాస్ హౌస్‌కి తానే బ్రహ్మ అన్నట్టుగా ఫీలవుతున్నాడు. చాలా వరకు సిరితో కలిసి సేఫ్ గేమ్ ఆడుతూ టాస్కుల్లో పెద్దగా ప్రభావం చూపిచని షన్ను తనకే అంతా తెలుసునని, అంతా తానేని అపోహపడుతూ మిగతా వారిని మరీ ముఖ్యంగా సన్నీ, అతనికి ఓట్లు వేసేవారిని విమర్శిస్తుందడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అంతే కాకుండా సన్నీని ఉద్దేశించి తప్పులు చేస్తున్నవారికి ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు వేస్తున్నారో అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు. ఇప్పుడిది అతనికి పెద్ద సమస్యగా మారుతోంది. ఎలిమినేషన్ విషయంలో ప్రియాంక, షన్నుల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఈ సందర్భంగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రియాంకని అడగ్గా .. నాకు కె (కాజల్) , పి ( ప్రియాంక)ల పైన డౌటుగా వుందని, ఈ ఇద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చునని తెలిపింది.
ఈ సందర్భంగా షన్ను తన మనసులోని మాటని బయటపెట్టాడు. నాకో డౌట్ మానస్ ఎలిమినేట్ కావచ్చు కదా అన్నాడు. అంతేనా సన్నీని ఉద్దేశిస్తూ ఎవరు ఎన్ని తప్పులు చేసినా ఫైనల్‌గా విజయం సాధిస్తారని, నా దృష్టిలో అతను ఎలిమినేట్ అవుతాడని తాను అనుకోవడం లేదని తెలిపాడు. ఒకరిని హర్ట్ చేసినవాళ్లే విన్ అవుతారని అనడం కరెక్ట్ కాదని ప్రియాంక అనడంతో.. `ఎన్ని తప్పులు చేసినా సన్నీకి కాజల్ హైప్ ఇస్తుంది` అని షన్ను అన్నాడు. దానికి ప్రియాంక `అది ఆమె గేమ్ ప్లాన్ అయ్యివుండొచ్చుకదా.. అంది. వెంటనే `వాళ్లది తప్పు అని చెప్పారు. కానీ బయటకు వెళ్లడం లేదు కదా వీళ్లు.. చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. వాళ్లు ఏం చేసినా ఏమీ అనరు.. ఓట్లు వేస్తూనే వున్నారు.. నేను హర్ట్ అయ్యాను` అన్నాడు షన్ను. దీంతో సన్నీ ఫ్యాన్స్ షన్నునీ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. ఓడిపోతాననే భయంతోనే షన్ను ఇలా మాట్లాడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
